ఓ ప్రయాణికురాలు పొరపాటున ‘థ్యాంక్యూ సర్’ అని చెప్పినందుకు విమానం నుంచి దించేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా విమానం ఎక్కే సమయంలో మహిళా అటెండెంట్ను పురుషునిగా భావించి.. ‘థ్యాంక్యూ సర్’ అంది. దీంతో ఆగ్రహించిన అటెండెంట్.. జెన్నాను ఫ్లైట్ నుంచి దించేసింది. క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదని జెన్నా వాపోయారు.