టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మార్చి 3 నుంచి 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు.
3, 4న ఒంగోలు, 5, 6న నెల్లూరు పార్లమెంటు పరిధిలోని సభల్లో పాల్గొంటారు. 7న సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, 8న సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి, 9న చంద్రగిరి, నగరి, 10న గంగాధర నెల్లూరు, చిత్తూరు, 11న పలమనేరు, కుప్పం సభలకు హాజరవుతారు.