భారత్ లో మీడియా వ్యాపారాలను విలీనం చేసే నిమిత్తం వాల్ట్ డిస్నీ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు బ్లూమ్బిర్గ్ వెల్లడించింది.
విలీనానంతర సంస్థలో 61 శాతం వాటా కలిగి ఉండేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. మిగిలిన వాటా డిస్నీ చేతిలో ఉంటుంది. నగదు- షేర్ల బదిలీ రూపంలో ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని సమాచారం.