రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు రావడంతో చిరు వ్యాపారులు తీవ్ర నష్టపోయారని సీఎం చంద్రబాబు తెలిపారు.
వ్యాపారులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, నష్టపోయిన వారిని గుర్తిస్తామని చెప్పారు. నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తామని వెల్లడించారు.