కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60కిలోమీటర్ల పొడవైన కొత్తలైనన్ను నిర్మించనున్నారు. ఇది సాకారమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది.