దేశంలో పెరుగుతోన్న రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
అన్ని లోకోమోటివ్లు(రైలు ఇంజిన్లు), ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేథ(ఏఐ) పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా వెల్లడించారు. ఏవైనా అసాధారణ పరిస్థితులను గుర్తించడంలో ఈ కెమెరాలు ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు.