గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్నెస్ రెన్యూవల్ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఫిటెనెస్కు ముందే ఆయా వాహనాల్లో వేగ నియంత్రణ పరికరాలు ఉండాలని అధికారులు సూచించారు.