అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసి సాయితేజ(26) మృతి చెందాడు.

మృతుడి స్వస్థలం ఖమ్మం మండలంలోని రామన్నపేట. ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే అతడు అమెరికా వెళ్లాడు.