శీతాకాలంలో చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగరు. అయితే శీతాకాలంలో దాహం వేయకపోయినా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పురుషులు రోజుకు 10 నుంచి 14 గ్లాసులు, మహిళలు 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలంటున్నారు. అంతే కాకుండా నీళ్లకు బదులు జ్యూస్, పాలు, టీ, కొబ్బరి నీళ్లు కూడా తాగవచ్చు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుందని చెబుతున్నారు.