సెప్టెంబరు 24 నుంచి 30 వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబరు 26న మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ప్రొవిజినల్ జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉంది.