రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దీనిపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావించడం సమంజసమే అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం పరిస్థితిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని హితవు చెప్తున్నారు. చార్జీలు పెంచే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.