ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అన్నారు.
అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని తెలిపారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడి క్రికెట్ నేర్చుకున్నానని తెలిపింది. తను ధోనీకి వీరాభిమానినని సినిమాలో ఏడు నెంబర్ జెర్సీనే వాడతానని తెలిపింది.