కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్ పై బస్సు బీభత్సం సృష్టించింది.

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మూడు బైకులు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.