అనెక్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది.
దీనికి సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దేశంలో 2024 మార్చి నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.78,000 కోట్లకు చేరినట్లు తెలిపారు.