పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ లో క్వింటాల్ పసుపు ధర గరిష్ఠంగా రూ. 18,299 పలికింది.
పెర్కిట్ కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతు పంటకు ఈ ధర లభించగా.. ఇటీవల పెరుగుతున్న ధరలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు కనిష్ఠ ధర రూ.8,000, సగటు ధర .14,250 పలికింది.