18వ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన మెహతాబ్ కటక్ నుంచి ఏడో సారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2019 వరకు బీజేడీ తరపున ఎంపీగా ఎన్నికైన ఆయన.. 2024 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి వరుసగా ఏడోసారి ఎంపీగా గెలిచారు.