తాను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు హ్యారీపై చర్యలు తీసుకుంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
2020 నుంచి అమెరికాలో ఉంటున్న హ్యారీ, గతంలో డ్రగ్స్ వాడినట్లు ఓ పుస్తకంలో వెల్లడించారు. అమెరికా వీసాకు అప్లై చేసినప్పుడు ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. తాను గెలిస్తే హ్యారీ విషయంపై దర్యాప్తు చేసి, అతడి తప్పున్నట్లైతే చర్యలు తీసుకుంటానని ట్రంప్ స్పష్టం చేశారు.