గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘యూ-విన్’ పోర్టల్ ను ఆగస్టు చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ పోర్టల్ ప్రతి సంవత్సరం 2.9 కోట్ల గర్భిణులకు, 2.6 కోట్ల మంది (0-1 సంవత్సరాల) శిశువులకు కంఠవాతము (డిప్తీరియా), మీజిల్స్, రూబెల్లా వంటి 12 రోగాలకు సంబంధించిన 11 వ్యాక్సిన్లను అందిస్తుంది.