అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మూడు లైన్లు కలిపి 106 కి.మీ.లను డబుల్ లైన్తో నిర్మిస్తేనే.. రాజధానికి న్యాయం జరుగుతుందంటున్నారు.