ఇటీవల కాలంలో కలెక్టర్లు స్కూల్ టీచర్లుగా మారిపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా లెక్కల మాస్టార్ గా మారారు.
శుక్రవారం తలమడుగు మండలంలోని బరంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు లెక్కలు బోధించారు.