శ్రీహరికోట నుంచి ఈ నెల 30న PSLV-C60 వాహక నౌక ద్వారా స్పెడెక్స్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో డాకింగ్, అన్ డాకింగ్ ఉపగ్రహాలు ఉన్నాయి.
వీటితోపాటు ముంబయిలోని అమిటీ యూనివర్సిటీ స్పెడెక్స్ మిషన్లో పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అంతరిక్షంలోని ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయో? అనే దానిపై అధ్యయనం చేస్తారు.