జోబైడెన్ ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే.

ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.. “బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేయాలని న్యాయశాఖను ఆదేశిస్తా. ఈ చర్య అమెరికన్ ప్రజలను రక్షిస్తుంది. దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తా” అని పేర్కొన్నారు.