ప్రపంచంలోని చాలా దేశాలకు కలరా వ్యాధి వ్యాపించింది. ఆఫ్రికా దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉందని.. వాటి ఉత్పత్తి పెంచాలని WHO చీఫ్ టెడ్రస్ అథనోమ్ తయారీదారులకు పిలుపునిచ్చారు.
జులై 28 వరకు 26 దేశాల్లో 3,07,433 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 2,326 మరణాలు సంభవించినట్లు WHO తెలిపింది.