గురుకులాల్లో 2,717 జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూనియర్ కాలేజీల్లో 1924, డిగ్రీ కాలేజీల్లో 793 పోస్టులకు గతేడాది ఆగస్టులో పరీక్ష జరిగింది.

ఇందులో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను ఈనెల రెండో వారంలో బోర్డు విడుదల చేసింది. డెమో తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించనుంది.