మేడారం మహా జాతరలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన భక్తుడు రోహిల్ లాల్.. చిలకలగుట్ట అటవీ ప్రాంతంలోని మాటేరుతోగు దగ్గర స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.