ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు. పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా CMకి నివేదించడం ఈ బృందం ప్రధాన విధి. ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ పేరుతో మొత్తం 25మందిని నియమించుకోవాలని నిర్ణయించారు.
ఇంటర్ లో ఆన్లైన్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతుంది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్’ తరహాలోనే ఇంటర్ లో జూనియర్ కాలేజీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (జోస్త్) విధానాన్ని తీసుకురానున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ను బట్టి, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. డిగ్రీ సీట్లను ‘దోస్త్’ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే తరహాలో ఇంటర్ లోనూ అడ్మిషన్లు కల్పించనున్నారు.
యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లిరోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ రాత్రే మెహతాజ్ వేరే అమ్మాయిని రహస్యంగా పెళ్లాడాడు. దీంతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు మెహతాబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ లోని వివిధ ప్రాంతాల్లో పనులకు ప్రభుత్వం రూ.7,032కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు GHMC అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, IIIT జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల పనులకు రూ.837 కోట్లు పరిపాలన అనుమతులు జారీ చేశారు.
రాగి జావతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావలో విటమిన్ సీ, విటమిన్ ఈ, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. రాగి జావ వల్ల జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు.
వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే భారత్ లో కేవలం ఒక్కటే కనిపిస్తుందని తెలిపారు. సెప్టెంబరు 7 లేదా 8న ఏర్పడే చంద్రగ్రహణాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉందని చెప్పారు.
2025 ఏడాదికి సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వులలో పేర్కొంది. జనవరి14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది, ఆగస్టు27న వినాయకచవితి, అక్టోబర్ 3న దసరా, 20న దీపావళి పండుగల నేపథ్యంలో సెలవులు ప్రకటించారు.
వందేళ్ల పాటు బతకాలంటే ఏం చేయాలనే ఓ వ్యక్తి ప్రశ్నకు ప్రముఖ కార్డియాక్ వైద్యులు డాక్టర్ నరేష్ త్రైహాన్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సారిన్ మంచి సమాధానం ఇచ్చారని పలువురు అంటున్నారు. వైద్యుల మాటల్లోనే ‘9pmకి నిద్రపోవాలి, మాంసాహారాన్ని త్యజించాలి, మద్య, దూమపానం జోలికి పోవద్దు. శృంగారం, వగైరాల గురించి ఆలోచించవద్దు’ అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీ ప్లాన్ గడువు ముగిసే వరకు ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19 ప్లాన్ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితంచేసింది. రూ.29 ప్లాన్ కు గడువును 2రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో కేవలం ఒకగంట వ్యవధిలో రూ.11తో మరో డేటా ప్యాక్ ను అందిస్తోంది. ఇప్పటికే కొత్త ప్లాన్లు అమల్లోకి వచ్చాయి.
యూపీఐ చెల్లింపుల విధానంలో RBI కీలక మార్పులు చేసింది. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు (సెండ్/ రిసీవ్) చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు ఓ సర్క్యులర్ విడుదల చేసింది.
శ్రీహరికోట నుంచి ఈ నెల 30న PSLV-C60 వాహక నౌక ద్వారా స్పెడెక్స్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో డాకింగ్, అన్ డాకింగ్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు ముంబయిలోని అమిటీ యూనివర్సిటీ స్పెడెక్స్ మిషన్లో పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అంతరిక్షంలోని ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయో? అనే దానిపై అధ్యయనం చేస్తారు.
జోబైడెన్ ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.. “బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేపిస్టులు, హంతకులకు మరణశిక్ష అమలుచేయాలని న్యాయశాఖను ఆదేశిస్తా. ఈ చర్య అమెరికన్ ప్రజలను రక్షిస్తుంది. దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తా” అని పేర్కొన్నారు.
ముంబయిలోని కందివాలికి చెందిన ఓ వ్యాపారవేత్త సిమ్ ను స్వాప్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి ఓటీపీ పొంది రూ.7.5కోట్లు బ్యాంకు నుంచి కొల్లగొట్టారు. అయితే అనుమానాస్పద విత్ డ్రాలు గుర్తించిన వ్యాపారి వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు ఫోన్ చేశారు. దీంతో రూ.4.65 కోట్లు నేరగాళ్ల చేతికి చిక్కకుండా పోలీసులు ఆపగలిగారు. మిగిలిన మొత్తాన్ని అప్పటికే వేర్వేరు అకౌంట్లకు మోసగాళ్లు బదిలీ చేసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్లో వివరాల్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. యాప్లో నమోదు చేసిన వివరాలపై 360 డిగ్రీల సాఫ్ట్వేర్తో మరోసారి పరిశీలన ఉంటుందన్నారు.
భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లో 2లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షలకు పైగా లడ్డూల విక్రయాలు జరిగాయి. ఈనెల 29న దీక్షల విరమణ ఉండటంతో భారీగా లడ్డూల తయారీతో పాటు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ రోజైన సోమవారం 63 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. TG, కర్ణాటక, TN నుంచి సైతం భవానీ దీక్షాధారులు వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కేటీఆర్ పై కేసు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. “ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. కేటీఆర్ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసు నిజమే అయితే.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం… Read more: జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా యర్రగొండపాలెంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్లిన ఓ అల్లుడు గ్రామంలో 12 ఇళ్లకు కన్నం వేశాడు. ఈ అల్లుడు చేసిన నిర్వాకం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఈ వరుస చోరీలపై గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుర్రపుశాల గ్రామంలోని ఓ కుటుంబ అల్లుడు ముండ్ల రామయ్య అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు.… Read more: AP : అత్తగారి ఊరిలో ఇళ్లకు కన్నం అల్లుడు… వివరాల్లోకి వెళ్ళితే…
రాష్ట్రంలో దేవాదాయ భూములు కాపాడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల లో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మాన్యాలను కాపాడేందుకు దేవాదాయ శాఖ చట్టాలను సవరించనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ భూముల లో మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఆయిల్పామ్ తోటల పెంపకం చేపట్టనున్నట్లు చెప్పారు.
పర్యాటక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనే ఏపీ ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టినట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిపై స్కై సైకిలింగ్, జిన్లైనర్ ను ఏర్పాటు చేశారు. జల విన్యాసాలపై ఆసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్లో చాలాకాలం తర్వాత మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు వారం కిందటే పారామోటార్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఫ్రాన్స్ లో చిడో తుఫాన్ భీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తుఫాను తాకడంతో మయోట్ ద్వీపంలో 14మంది మరణించగా, 246మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయని, గాలులవల్ల భారీగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కుప్పకూలాయి. 90ఏళ్లలో మయోట్ ను తాకిన అత్యంత భయంకరమైన తుపాన్ ఇదేనని అధికారులు అంచనా వేశారు.