ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగోలో ‘క్యూట్’ ఫీజు కింద రూ.50 వసూలుచేయడం నెట్టింట విమర్శలకు దారితీసింది. కాగా.. దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది.
“క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్పోర్టుల్లో మెటల్ డిటెక్టింగ్ మెషిన్లు, ఎస్కలేటర్లు, ఇతర పరికరాలను ఉపయోగించినందుకు వీటిని వసూలు చేస్తాం” అని ఇండిగో వెల్లడించింది.