అసోంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంటును టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. 2025 కల్లా ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయని.. దీని ద్వారా 27,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు.
ఇతర సెమీకండక్టర్ కంపెనీలు కూడా తొలుత సరఫరాదారుగా కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, అయితే క్రమక్రమంగా అవి కూడా దేశంలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు.