జర్మనీలో బాల్టిక్ తీరం వెంబడి 21M లోతున దాదాపు ఒక కిలోమీటర్ వెడల్పుతో 11,000 ఏళ్లనాటి మానవ నిర్మిత కట్టడం బయటపడింది.
ఇది ఐరోపాలోనే అతి పురాతన కట్టడంగా సైంటిస్టులు భావిస్తున్నారు. 300 భారీ బండ రాళ్లు, 1,400 చిన్న రాళ్లతో ఈ గోడను నిర్మించారని చెప్పారు.
ఈ భారీ రాళ్లను కదల్చడం అసాధ్యమని, అప్పట్లోనే అధునాతన పద్ధతిలో ఓ చోటకు చేర్చారని తెలిపారు. దీన్ని బ్లింకర్వాల్ అని పిలుస్తున్నారు.