రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టు ఇనామ్గూడ వద్ద అతివేగంతో కారు చెరువులో దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు పిల్లలతోపాటు తండ్రి చెరువులో మునిగిపోయాడు.

దీనిని గమనించిన స్థానికులు నలుగురిని రక్షించి సురక్షింగా ఒడ్డుకు తీసుకొచ్చారు. భార్యభర్తల గొడవల కారణంగా ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.