వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి CUET-UG పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయించింది.

పరీక్ష కేంద్రంలో సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు NTA వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారికి మరోసారి పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.