సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే తమ డిమాండ్లను స్వీకరించాలని ఎమ్మెల్సీ కవిత సవాలు చేశారు.
‘అవినీతి ఆరోపణలున్న మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తప్పించి ఎంక్వైరీ వేయండి. విద్యుత్ సంస్థలో ఆంధ్రులను తీసేసి తెలంగాణ వాళ్లని నియమించండి. మీ ఓటుకు నోటు కేసు లాయర్లను సుప్రీం కోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా పెట్టారు. వారి స్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేవారికి అవకాశమివ్వండి’ అని డిమాండ్ చేశారు.