బహిరంగ మార్కెట్లో కంది, సెనగ పప్పులు, కాబూలీ సెనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై పరిమితులు విధించింది.
ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే అమలయ్యేలా ఉత్తర్వును జారీ చేసింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో పప్పులను ఉంచేందుకు, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు, వదంతులను నిలువరించేందుకు కేంద్రం తాజా చర్యకు ఉపక్రమించింది.