DSC పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు.

అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచి నియామక ఉత్తర్వులను అందజేస్తారు.