భారత్ లో 2018తో పోలిస్తే చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. 18 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే రిపోర్టును కేంద్రం తాజాగా విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా 13,874 చిరుతలు ఉండగా, అత్య ధికంగా మధ్య ప్రదేశ్లో 3907 ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 1985, కర్ణాటకలో 1879, తమిళనాడులో 1070 చిరుత పులులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. గడచిన ఐదేళ్లలో 1022 చిరుతలు పెరగడం విశేషం.