ఐపీఎల్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా, రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ మధ్య నేడు క్వాలిఫయర్-1 జరగనుంది. బాదుడు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం.
గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆదివారమే చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ఈ జట్లకు తక్కువ విరామమే లభించింది. అయితే కమిన్స్ నేతృత్వంలోని సన్రైజర్స్ ఊపు తమవైపే ఉన్నట్లు భావిస్తోంది.