లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్నవారికి మాఫీ వర్తిస్తుందో (కటాఫ్) ఇప్పటికే వివరాలు ప్రకటించారు.
అయితే కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ వర్తింపజేస్తారా? అనేది ప్రకటించాలి. ఆగస్టు 15లోగా రూ.2లక్షల్లోపు పంటరుణాలు మాఫీ చేస్తామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే.