తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు.
ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 80,735 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని 40,524 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.