యూపీఐ చెల్లింపుల విధానంలో RBI కీలక మార్పులు చేసింది. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని పేర్కొంది.
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు (సెండ్/ రిసీవ్) చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు ఓ సర్క్యులర్ విడుదల చేసింది.