కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల ఎంపికకు ప్రధాని మోదీ సారథ్యంలోని కమిటీ ఈ నెల 14న భేటీ కానుంది.
ఈసీ అరుణ్ గోయెల్ ఇటీవల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరో ఈసీ అనూప్ చంద్ర పాండే పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో కొత్త కమిషనర్లను ఒక కేంద్ర మంత్రి, లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ తో కూడిన కమిటీ ఎంపిక చేయనుంది.