ఇండిగో టికెట్ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్ ఛార్జీలతో పాటు క్యూట్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అంటూ ఇతరత్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్సింగ్ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్ చేశారు.
“ఏంటీ క్యూట్ ఫీజు? యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా? ‘ అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు.