కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది.

ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.