కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది.
ఆయన పోటీ చేస్తే ఎన్నికల్లో మరింత ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతల అంచనా. ఈ విషయంపై AICC చీఫ్ ఖర్గేతో CM రేవంత్ చర్చించారని, దీంతో రాహుల్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆయన అమేథీ నుంచి ఓడిపోగా, వయనాడ్లో MPగా గెలిచిన విషయం తెలిసిందే.