ముంబయిలోని కందివాలికి చెందిన ఓ వ్యాపారవేత్త సిమ్ ను స్వాప్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి ఓటీపీ పొంది రూ.7.5కోట్లు బ్యాంకు నుంచి కొల్లగొట్టారు.
అయితే అనుమానాస్పద విత్ డ్రాలు గుర్తించిన వ్యాపారి వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు ఫోన్ చేశారు. దీంతో రూ.4.65 కోట్లు నేరగాళ్ల చేతికి చిక్కకుండా పోలీసులు ఆపగలిగారు. మిగిలిన మొత్తాన్ని అప్పటికే వేర్వేరు అకౌంట్లకు మోసగాళ్లు బదిలీ చేసుకున్నారు.