భారత్లో పేదరికం 5శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ సీఈఓ బీబీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 2022-23 మధ్య కాలంలో చేసిన గృహ వినియోగ వ్యయ సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు.
‘ప్రజల ఆదాయం పెరిగినట్లు నీతి ఆయోగ్ సర్వేలో తేలింది. 2011తో పోలిస్తే సర్వే సమయంలో పట్టణాల్లో నెలవారీ ఖర్చు 33.5శాతం, గ్రామాల్లో 40.42శాతం పెరిగింది. నివేదికను బట్టి చూస్తే భారత్లో పేదరికం దాదాపు అదృశ్యమైనట్లే’ అని వివరించారు.