తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ వేయాలంటే ముందస్తుగా ట్రైన్‌ టికెట్లు మొదలు దర్శనం టికెట్స్‌, రూమ్స్‌ వరకు అన్నీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి జంజాటం లేకుండా సింపుల్‌గా తిరుమల వెళ్లొస్తే భలే ఉంటుంది కదూ! మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా.? అయితే మీకోసమే తెలంగాణ టూరిజం ఓ మంచి టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తోంది. హైదరాబాద్ తిరుమల టూర్‌ పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ టూర్‌ కేవలం ఒక్క రోజులోనే పూర్తి అవుతుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రయాణం ఇలా సాగుతుంది..

* మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది.

* రాత్రంతగా ప్రయాణం తర్వాత ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అనంతరం ఫ్రెషప్‌ తర్వాత స్థానికంగా ఉండే ఆలయాలను సందర్శించాల్సి ఉంటుంది. వెంటనే శ్రీవారి శీఘ్రదర్శనం ఉంటుంది. (దర్శనం టికెట్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతుంది). అనంతరం తిరుపతికి చేరుకుంటారు.

* తిరుపతిలో ఫ్రెషప్‌ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.

* మరుసటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంలో టూర్‌ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ఈ టూర్ ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. రూ. 3,700గా నిర్ణయించారు. చిన్నారులకు రూ. 2,960 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.