తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరితో ‘సార్’ చేసి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం చేసేందుకు ఆయన ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. సామాజిక అంశంతో కూడుకున్న ఈ మూవీని ‘శ్రీకారం’ ఫేమ్ బి. కిశోర్ డైరెక్ట్ చేస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.