బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ఈ చిన్నది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే అక్కడ నటి నటుల పై షాకింగ్ వార్తల్లో నిలిచింది కంగనా. ఈ అమ్మడు రణబీర్ కపూర్ , అలియా భట్, కరణ్ జోహార్ ఇలా చాలా మందికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కంగనా మరో షాకింగ్ ప్రకటన చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరింది. ఎప్పటిలాగే కొందరు కంగనాపై విమర్శలు చేస్తే మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు.

కంగనా ఏ అంశంపైనైనా నేరుగా మాట్లాడుతుంది. తన మనసులో వచ్చిన ఆలోచనలను బహిరంగంగా పంచుకుంటారు. దీని ద్వారా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కంగనా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కంగనా రనౌత్ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాన్ని పంచుకుంది. ‘ డార్క్ వెబ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా చేయాలి. చాలా మంది సినీ ప్రముఖులు డార్క్ వెబ్ నుంచి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. దీనికి తోడు వాట్సాప్, మెయిల్స్ హ్యాక్ అవుతున్నాయి. సెంట్రల్ డిటెక్షన్ పెరిగితే పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుందని కంగనా రాసుకొచ్చింది.

కంగనా చేసిన కామెంట్స్ ను కొందరు సీరియస్ గా తీసుకుంటే మరికొంతమంది లైట్ తీసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే ఇటీవల కంగనాకు పెద్దగా విజయం దక్కలేదు. ‘ఎమర్జెన్సీ’ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తుంది. ఈ చిత్రంలో ఆమె ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ సినిమాపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనాను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇందులో వివాదాస్పదం ఏమీ లేదు’ అని కంగనా అన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గత ఏడాదే సినిమా విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.

కంగనా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్…

A post shared by Kangana Ranaut (@kanganaranaut)