ఒకవేళ దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Al)పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ITశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కీలకరంగాల్లో AI డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించాలని ఎంపీ అనుపత్రి ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా అవసరం ఉంటే AI చట్టాలను తీసుకువస్తామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.