ఆన్లైన్ లో జరుగుతున్న గంజాయి చాక్లెట్ల బిజినెస్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం గుర్తించింది.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న 8 కంపెనీలు ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ చేస్తే గంజాయి చాక్లెట్లను డెలివరీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరప్రదేశ్ కు వెళ్లి గంజాయి చాక్లెట్లు విక్రయించే ఇద్దరు కంపెనీ యజమానులను అరెస్ట్ చేశారు.